Tuesday, 22 December 2020

బొద్దుగా మారనున్న కీర్తి సురేష్.. మహేష్ కోసమేనా?

‘మహానటి’ సినిమాతో అన్ని వర్గాలను ఆకట్టుకుని జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది మలయాళ ముద్దుగుమ్మ . అందులో పాత్రలకు తగినట్లుగా తనను తాను రూపం మార్చుకున్న తీరు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. అందుకోసం కాస్త బరువు కూడా పెరిగింది. అయితే ఆ తర్వాత కీర్తి చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. లాక్‌డౌన్ సమయంలో ఓటీటీ ద్వారా రిలీజైన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు బాగా నిరాశపరిచాయి. Also Read: అయితే ఈ రెండు సినిమాల్లో కీర్తి స్లిమ్ లుక్‌లో కనిపించింది. ఈ లుక్‌కు అభిమానుల నుంచి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో కీర్తి మళ్లీ బరువు పెరుగుతోందట. మహేష్ హీరోగా డైరెక్టర్ పరశురామ్ రూపొందిస్తున్న `సర్కారు వారి పాట`లో ఆమె హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మునుపటి రూపంలో కనిపించేందుకు కాస్త బొద్దుగా తయారవుతోందట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3pgZvBF
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...