Tuesday, 22 December 2020

‘ఇలాంటి డ్రెస్సులు వేసుకోలేకపోయాం’.. సమంత ఫన్నీ వీడియో వైరల్

వెండితెరపై టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన .. పెళ్లి తర్వాత కూడా మంచి ఆఫర్లు దక్కించుకుంటూ షాకిస్తోంది. అయితే ఇటీవల సినిమాలను కాస్త పక్కన పెట్టిన అక్కినేని వారి కోడలు డిజిటల్ వేదికపై కన్నేసింది. ఈ క్రమంలోనే ఆహా యాప్ కోసం ‘సామ్ జామ్’ షో నిర్వహిస్తూ టాప్ సెలబ్రెటీలను ఇంటర్వ్యూలు చేస్తోంది. త్వరలోనే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్‌లో నటించనుంది. కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా వెల్లడిస్తూనే ఉంటుంది. Also Read: ఈ క్రమంలోనే మంగళవారం సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో అనేక రకాల ఫ్యాషన్ దుస్తుల్లో మెరిసిన సామ్... ‘ఈ ఏడాది ఇలాంటి డ్రెస్‌లు వేసుకుందామనుకున్నాం.. కానీ వేసుకోలేకపోయాం’ కామెంట్ పెట్టింది. ఫన్నీగా ఉన్న ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. సినీ నటి మంచు లక్ష్మి, మోడల్ శిల్పా రెడ్డి తదితరులు ఈ వీడియో చూసి సమంతను ప్రశంసించారు. నెటిజన్లు కూడా ఈ వీడియోకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3phA96D
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...