Wednesday, 9 December 2020

ఒక్క ట్వీట్‌తొ సమంతను టార్గెట్ చేసిన బన్నీ, మహేశ్ ఫ్యాన్స్

చేయి దాటినా తీసుకోగలం గానీ.. నోరు జారితే వెనక్కి తీసుకోలేమని పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడంతా సోషల్‌మీడియా యుగం కాబట్టి ఏ విషయంపై అయినా జాగ్రత్తగా పోస్ట్ చేయాలి. అందులో తప్పు దొర్లిందో తన ఆ పోస్ట్ డిలీట్ చేసినా స్ర్కీన్‌షాట్ రూపంలో వైరల్ అయి పరువు తీస్తూనే ఉంటుంది. సెలబ్రెటీలు అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు హీరోయిన్ అక్కినేని అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. అసలు విషయానికొస్తే.. సూర్య నటించిన ‘’ గత నెలలో అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుంచి విమర్శకుల వరకు ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇటీవలే ఈ సినిమాను చూసిన సమంత సినిమా అద్భుతంగా ఉందంటూ డిసెంబర్ 1న ట్వీట్ చేసింది. అంతటితో ఆగకుండా ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అంటూ సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది. ఇక్కడే బన్నీ, మహేశ్‌‌ ఫ్యాన్స్‌కి ఎక్కడో కాలింది. దీంతో సమంతను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో.. చిత్రాలు ఒకదానికొకటి పోటీపడి మరీ బాక్సాఫీసును దద్దరిల్లేలా చేశాయి. ఈ రెండు సినిమాలు సూపర్‌స్టార్, స్టైలిష్ స్టార్ కెరీర్లోనే ఆల్‌టైమ్ హిట్లుగా నిలిచాయి. దీంతో సూర్య సినిమాకు సమంత ఇచ్చిన కాంప్లిమెంట్.. తమ హీరోల సినిమాలను కించపరిచేలా ఉన్నాయంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. సినిమా నచ్చితే అభినందిస్తే చాలని... కానీ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ అంటూ మిగతా సినిమాలను తక్కువ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ కామెంట్లను సమంత లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33Z9hA8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...