Friday, 4 December 2020

చివ‌రి షెడ్యూల్లో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’.. నాని స్పీడు మామూలుగా లేదు!

నేచుర‌ల్ స్టార్ హీరోగా శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ట‌క్ జ‌గ‌దీష్’. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం హైద‌రాబాద్‌లో చివ‌రి షెడ్యూల్లోకి ప్రవేశించింది. నాని 26వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శుక్రవారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైన చివరి షెడ్యూల్‌లో చిత్రంలోని ప్రధాన తారాగ‌ణ‌మంతా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో రీతు వ‌ర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, రావు రమేష్, నరేష్, నాజర్, దేవదర్శిని, రోహిణి, మాల పార్వతి, డేనియల్ బాలాజి, తిరువీర్, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్. వెంకట్ ఫైట్స్ కంపోజ్ చేస్తు్న్నారు. లక్ష్మణ్ ముసులూరి కో-డైరెక్టర్. ఎస్. వెంకటరత్నం (వెంకట్) ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కాగా, నాని ఈ ఏడాది ‘V’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఓటీటీ ద్వారా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సుధీర్ బాబు మరో హీరోగా నటించిన ఈ చిత్రానికి ఇంద్రగంటి మోహన్‌క్రిష్ణ దర్శకత్వం వహించారు. అదితీరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రంతో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను పలకరించిన నాని.. ‘టక్ జగదీష్’తో మాత్రం నేరుగా థియేటర్లలోకే రానున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37BXPvd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...