Sunday, 27 December 2020

షూటింగ్‌కి రెడీ అవుతున్న ‘బంగార్రాజు’.. కీలక పాత్రలో రమ్యకృష్ణ!

బిగ్‌బాస్-4 సీజన్ ముగియడంతో కింగ్ నాగార్జున సినిమాలతో బిజీగా మారనున్నారు. ఈ మధ్యలోనే కాస్త గ్యాప్ తీసుకుని ‘వైల్డ్ డాగ్’ సినిమా పూర్తి చేసిన నాగ్.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు రెడీ అయ్యారు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఎంత ఘన విజయం సాధించిందో తెలిసిందే. నాగ్ కెరీర్లోనే ఓ ప్రత్యేకమైన సినిమా నిలిచిపోయింది. ముఖ్యంగా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. Also Read: ఇప్పుడు ఆ పాత్రకు సీక్వెల్‌గా నాగార్జునతో ‘బంగార్రాజు’ టైటిల్‌లో కళ్యాణ్ కృష్ణ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 16న ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు సమాచారం. జనవరిలోనే షూటింగ్‌ మొదలుపెట్టి సింగిల్ షెడ్యూల్‌‌లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేసుకుంటున్నాడట. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ‘సోగ్గాడే చిన్నినాయనా’లో బంగార్రాజు భార్య సత్య‌గా రమ్యకృష్ణ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సాంగ్స్ కంపోజిషన్ జరుగుతున్నట్లు సమాచారం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nTZ93K
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...