Sunday, 27 December 2020

గూఢచారిగా బాలకృష్ణ... సరికొత్త పాత్రలో నందమూరి హీరో

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఆయన కోసం ఇద్దరు యంగ్ డైరెక్టర్లు స్ర్కిప్టులు పట్టుకుని ఎదురుచూస్తున్నారు. మరోవైపు సీనియర్ దర్శకుడు బి.గోపాల్‌తో బాలయ్య సినిమా చేయనున్నారంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ బాలయ్య కోసం అదిరిపోయే కథ రెడీ చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ గూఢచారిగా కనిపిస్తారట. బాలయ్య - బి.గోపాల్ కాంబినేషన్‌ అంటే గతంలో సెన్సేషన్‌. లారీడ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమర సింహారెడ్డి, నరసింహనాయుడు..ఇలా అన్ని సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. అయితే 2003లో వచ్చిన ‘పలనాటి బ్రహ్మనాయుడు’ మాత్రం దారుణ పరాజయం పాలైంది. అప్పటి నుంచి బి.గోపాల్‌కు అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీలో కనుమరుగైపోయారు. అయితే వీరి కాంబినేషన్ కోసం బుర్రా సాయిమాధవ్, ఆకుల శివ మంచి స్ర్కిప్ట్ రెడీ చేశారని, బాలకృష్ణ పాత్ర సరికొత్తగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే సినిమాలో బాలకృష్ణ నటించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇవన్నీ రూమర్లే తప్ప ఏ ఒక్కరి నుంచి అధికారిక ప్రకటన రావడం లేదు. గతంలో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగానే బాలయ్య మరో సినిమాను అనౌన్స్ చేసేవారు. అయితే ఈ సారి మాత్రం ఎవరితో సినిమా చేయాలన్న దానిపై ఆయన నిర్ణయం తీసుకోలేకపోతున్నారన్న టాక్ నడుస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KX2kJt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...