Monday, 28 December 2020

హాట్ టాపిక్‌గా మారిన అమితాబ్ మనవరాలి డేటింగ్ వ్యవహారం.. ప్రియుడి కామెంట్‌‌తో ఇష్యూ వైరల్

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు ప్రేమ వ్యవహారం మరోసారి బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె డేటింగ్ సంగతులపై గత కొన్ని రోజులుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తున్న సంగతి. ఓ నటుడి కుమారుడితో నవ్య ప్రేమలో పడిందని, ప్రస్తుతం అతనితో డేటింగ్ కూడా చేస్తోందనే రూమర్స్ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా నవ్య పెట్టిన ఓ పోస్ట్‌పై ప్రియుడు చేసిన కామెంట్‌తో మరోసారి ఈ ఇష్యూ చర్చల్లో నిలిచింది. అమితాబ్, జయబచ్చన్ మనవరాలిగా సెలబ్రిటీ స్టేటస్‌ అనుభవిస్తున్న నవ్య నవేలి.. ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ జావెద్ జాఫ్రీ కుమారుడు మీజాన్‌ జాఫ్రీతో డేటింగ్‌లో ఉందనే విషయం గత కొన్నిరోజులుగా బీ టౌన్‌లో ట్రెండింగ్ న్యూస్‌గా నడుస్తోంది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్న నవ్య, రీసెంట్‌గా అతనితో దిగిన పిక్‌ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నట్లు అంతా ఫిక్సయ్యారు. అయితే ఇటీవల నవ్య నవేలితో రిలేషన్‌షిప్ గురించి ఓ మీడియాతో ముచ్చటించిన మీజాన్‌‌.. తమ మధ్య ఉంది కేవలం ఫ్రెండ్‌షిప్ మాత్రమే అని, డేటింగ్ లాంటి రిలేషన్‌షిప్ లేదని కన్ఫర్మ్ చేయడంతో అంతా ఈ విషయాన్ని వదిలేశారు. ఈ క్రమంలో తాజాగా నవ్య.. తన రూఫ్‌పై కూర్చొని ముఖం దాచేసుకున్న మరో ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో దానిపై 'ఏదీ నీ ముఖం చూపించు' అంటూ మీజాన్ కామెంట్ చేస్తూ లవ్ గుర్తు ఎమోజీలు పెట్టారు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహారం మళ్ళీ చర్చల్లోకి వచ్చేసింది. ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్‌కి బలం చేకూర్చింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MfuYpN
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...