Monday, 21 December 2020

చరణ్, తారక్, మహేష్ బాబు.. వరుసపెట్టి అందరిపేర్లు చెప్పేసి ఆశ్చర్యపర్చిన చిరంజీవి.. సమంత షాక్!!

స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోగా ఇప్పటికీ ఓ వెలుగు వెలుగుతూ వెండితెర మెగాస్టార్‌గా కీర్తించబడుతున్న 150కి పైగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు అందించి టాలీవుడ్ రారాజుగా పిలిపించుకుంటున్నారు. ఇక ఈ మధ్యకాలంలో మరింత హుషారుగా కనిపిస్తున్న ఆయన.. తనదైన స్టైల్‌లో ఆన్‌లైన్ వేదికలపై కూడా సత్తా చాటుతున్నారు. సోషల్ మీడియా ఖాతాల్లో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోయింగ్ పెంచుకోవడమే గాక పలు టీవీ కార్యక్రమాల్లో స్పెషల్ గెస్ట్‌గా హాజరవుతూ తనదైన మాటలతో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అక్కినేని కోడలు సమంతతో చేస్తున్న 'సామ్ జామ్' ప్రోగ్రాంలో పాల్గొని సందడి చేశారు చిరు. ఇప్పటికే ఈ ప్రోగ్రాం తాలూకు ప్రోమో విడుదలై వైరల్ కాగా తాజాగా మరో ప్రోమో రిలీజ్ చేసి ఈ టాక్ షోపై జనాల్లో ఆతృత పెంచేసింది 'ఆహా' మేనేజ్‌మెంట్. లేటెస్ట్‌గా వదిలిన ఈ వీడియోలో మెగాస్టార్ మాటలు విని.. స్టన్ అయిపోయి అలాగే చూస్తుండటం హైలైట్ అయింది. కార్యక్రమంలో భాగంగా.. ''మీరు ఎన్నో హిట్ సినిమాలు చేశారు.. ఒకవేళ అవి రీమేక్ చేయాలంటే మీ రోల్ ఎవరు చేస్తే బాగుంటుంది చెప్పండి'' అని అడిగిన ప్రశ్నపై.. చరణ్, తారక్, బన్నీ, రవితేజ, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, పవన్ కళ్యాణ్ కూడా అంటూ వరుసపెట్టి అందరి పేర్లు చెప్పేసి ఆశ్చర్యపర్చారు చిరంజీవి. 'నాతో ఎంజాయ్‌మెంట్ మామూలుగా ఉండదు' అంటూ ప్రముఖ ఓటీటీ వేదిక `ఆహా`పై అక్కినేని కోడలు సమంత హోస్ట్ చేస్తున్న 'సామ్ జామ్' టాక్ షోలో ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, త‌మ‌న్నా, ర‌కుల్ ప్రీత్ సింగ్, నాగ్ అశ్విన్, క్రిష్ తదితరులు పాల్గొని సందడి చేయగా.. ఇప్పుడు చిరంజీవి విచ్చేశారు. ఆహా వేదికపై ఈ షో ఫుల్ ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LYvhoP
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...