సూపర్ స్టార్ 70వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 12న ఆయన పుట్టినరోజు సందర్భంగా తమిళనాడులో అభిమానులు హంగామా చేశారు. సూపర్‌స్టార్ బర్త్‌డే సందర్భంగా అనేక చోట్ల కేకులు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అయితే ఆ రోజు పార్టీ పనుల నిమిత్తం రజినీ ఢిల్లీ ఉండటంతో ఇంట్లోనే బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకోలేకపోయారు. దీంతో రజినీకాంత్ వెరైటీగా విమానంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ‘అన్నాత్తై’ షూటింగ్ నిమిత్తం రజినీకాంత్ తన యూనిట్‌తో కలిసి ఆదివారం చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానం ఆకాశంలో కొన్నివేల అడుగులపైన ప్రయాణిస్తున్న సమయంలో రజినీ కేక్ కట్ చేశారు. ఈ వేడుకల్లో రజినీ కుమార్తె ఐశ్వర్య ధనుష్, హీరోయిన్ నయనతారతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WfGjYo
v
No comments:
Post a Comment