మెగా బ్రదర్ నాగబాబు కూతురు తన భర్తతో కలిసి సోమవారం ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకస్వామి మండపంలో అర్చకులు నూతన దంపతులకు ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. Also Read: నిహారికకు జొన్నలగడ్డ చైతన్యతో ఈ నెల 9వ తేదీ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. అనంతరం డిసెంబర్ 11న (శుక్రవారం) హైదరాబాద్‌లో భారీ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులతో పాటు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖలు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3gHP9b5
v
No comments:
Post a Comment