Tuesday, 1 December 2020

పూనమ్ కౌర్ ఎదపై త్రిశూలం, నాగుపాము పచ్చబొట్లు.. ఇదో రకం భక్తి

హీరోయిన్లు పచ్చబొట్లు (టాటూలు) వేసుకోవడం కొత్తేమీ కాదు. నిజానికి ఈ టాటూలు వారికి ఫ్యాషన్. శరీరాన్ని దాచుకునే చోట టాటూలు వేసుకుని వాటిని బయటపెడుతూ ఉంటారు. శృతిహాసన్, త్రిష, నయనతార, సిమ్రన్, తాప్సీ, సమంత అక్కినేని, సంజన గల్రానీ, నమిత, అనసూయ.. ఇలా చాలా మంది నటీమణులు శరీరంపై టాటూలు వేయించుకున్నారు. తాజాగా నటి ఇలానే టాటూలు వేయించుకున్నారు. వాటిని బయటపెడుతూ ఆధ్యాత్మికతను అందరికీ పంచుతున్నారు. Also Read: పూనమ్ కౌర్ తన ఎదపై చిన్న త్రిశూలం, నాగుపాము టాటూలను వేయించుకున్నారు. అంతేకాదు, ఆ టాటూలను చూపిస్తూ కొన్ని సెల్ఫీలు తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అంతేకాదు, గుండెలో త్రిశూలం ఉన్నప్పుడు.. అది ఓం నమఃశివాయ అంటుందని కూడా పేర్కొన్నారు. త్రిశూలం, శేషనాగు.. ఇవి శివుడికి సంకేతాలు. ప్రస్తుతం కార్తీకమాసం నడుస్తోంది. అందుకే, శివుడిపై భక్తితో పూనమ్ కౌర్ ఈ టాటూలు వేయించుకున్నారు. అయితే, ఆమె ఎదపై వేయించుకోవడం చర్చనీయాంశం అయ్యింది. పూనమ్ కౌర్ అభిమానులు కొంత మంది టాటూలు చాలా బాగున్నాయని కొనియాడుతుంటే.. మరికొంత మంది మాత్రం పూనమ్‌పై మండిపడుతున్నారు. పవిత్రమైన త్రిశూలం టాటూను ఎదపై వేయించుకుంటావా అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అయితే మరి గుండెలో పవన్ కళ్యాణ్ ఉంటే అంటూ వెటకారం చేస్తున్నారు. ఏదేమైనా పూనమ్ టాటూ సెల్ఫీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ‘ఒక ‘వి’చిత్రం’, ‘శౌర్యం’, ‘నాగవల్లి’, ‘గగనం’, ‘అటాక్’, ‘నాయకి’ వంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పూనమ్ కౌర్ చివరిగా 2018లో వచ్చిన ‘నెక్ట్స్ ఏంటి’ సినిమాలో కనిపించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37pigLZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...