Tuesday, 1 December 2020

మహేష్ బాబు ముందడుగు.. ధైర్యంగా నిర్ణయం తీసుకున్న సూపర్ స్టార్!

కరోనా వైరస్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినీ రంగం ఒకటి. సుమారు ఏడు నెలల పాటు సినీ పరిశ్రమ మూతబడటంతో తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. షూటింగ్‌లు ఆగిపోవడం, థియేటర్లు మూతబడటంతో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. అయితే, సినీ పరిశ్రమకు జరిగిన నష్టాన్ని ఇప్పుడు పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు టాలీవుడ్ పెద్దలు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపి తమను ఆదుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ సైతం ఇటీవల తెలుగు సినీ పరిశ్రమపై వరాల జల్లు కురిపించారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా, సినిమా టిక్కెట్లను సవరించుకునే వెసులుబాటును కూడా కల్పించారు. అయితే, థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం పెట్టిన నిబంధనలు యాజమాన్యాలకు అడ్డంకిగా మారాయి. ఎందుకంటే కరోనా వ్యాప్తిని అడ్డుకుంటూ 50 శాతం ఆక్యుపెన్సీతో మాత్రమే థియేటర్లు తెరవాలి. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో ఏ థియేటర్ తెరుచుకోలేదు. Also Read: అయితే, మొదటిసారిగా ఏఎంబీ సినిమాస్ డిసెంబర్ 4న తెరుచుకుంటోంది. సూపర్ స్టార్ భాగస్వామిగా ఉన్న ఏఎంబీ సినిమాస్ ఒకడుగు ముందుకేసి సినీ ప్రదర్శన మొదలుపెడుతోంది. మంగళవారం నుంచి టిక్కెట్ బుకింగ్ కూడా ప్రారంభించింది. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ ఒక వీడియో మెసేజ్‌ను విడుదల చేశారు. ఏఎంబీ సినిమాస్ ప్రకటనతో సినీ ప్రేమికుల్లో ఉత్సాహం వచ్చింది. సినీ ప్రముఖులు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. రానా దగ్గుబాటి సైతం దీనిపై ట్వీట్ చేశారు. మొత్తం మీద మహేష్ బాబు అండ్ టీం ధైర్యంగా నిర్ణయం తీసుకుని మిగిలిన వారికి మార్గదర్శకం చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39uO6cX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...