బుల్లితెరపై యాంకర్‌గా, వెండితెరపై నటిగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు భరద్వాజ్. ముఖ్యంగా ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర పోషించిన తరవాత అనసూయ పాపులారిటీ బాగా పెరిగింది. అంతేకాదు, సినిమాల్లో అవకాశాలు పెరిగాయి. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రంగమార్తాండ’ సినిమాలో, రవితేజ హీరోగా వస్తోన్న ‘కిలాడి’లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే, ‘థ్యాంక్ యు బ్రదర్’ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న అనసూయ ఇప్పుడు తమిళ ఆడియన్స్‌ను పలకరించడానికి వెళ్తున్నారు. కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆమె తొలి తమిళ సినిమాను తాజాగా అంగీకరించారు. అది కూడా తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి సినిమాలో కావడం విశేషం. తాను తమిళ సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్న విషయాన్ని అనసూయ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘‘మరో మంచి కథలో జీవిస్తున్నాను. కొత్త ప్రయాణం’’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో అనసూయ పేర్కొన్నారు. అంతేకాదు, తన లుక్‌ను కూడా పోస్ట్ చేశారు. అద్దంలో తన అందాన్ని చూసుకుంటూ అనసూయ ఈ ఫొటోలో కనిపించారు. అచ్చతెలుగు అమ్మాయిలా చీరలో అందంగా సింగారించుకుని ఉన్నారు అనసూయ. ఈ లుక్‌కు ప్రముఖ నటి సిల్క్ స్మిత రిఫరెన్స్ అని అనసూయ పేర్కొన్నారు. అంటే ఈ సినిమాలో ఆమె సిల్క్ స్మితను పోలిన పాత్రలో నటిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. ఏదేమైతేనేం ఒక మంచి సినిమాతో అనసూయ తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఆల్ ది బెస్ట్ అను. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3qvzz6X
v
No comments:
Post a Comment