Friday, 4 December 2020

మెగా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యే క్రేజీ అప్‌డేట్.. ఒకే తెరపై మహేష్ బాబు‌, పవన్ కళ్యాణ్!

మల్టీస్టారర్ సినిమాలంటే జనాల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. స్టార్ హీరోలిద్దరూ ఒకే తెరను పంచుకోవడం కన్నుల పండగలా భావిస్తుంటారు ప్రేక్షకులు. ఆనాటి నుంచి నేటివరకూ మల్టీస్టారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ఓ స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో చేసే రోల్ ఎంత చిన్నదైనా కూడా ఆ మూవీకి సూపర్ రెస్పాన్స్ దక్కుతుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెగా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అయ్యేలా ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ బాబు సినిమాలో భాగం కాబోతున్నారనేది లేటెస్ట్ టాక్. రెండేళ్లుగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఇటీవలే తిరిగి కెమెరా ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం అనంతరం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' మూవీ చేస్తున్న పవర్ స్టార్.. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి, సాగర్ కే చంద్ర, హరీశ్ శంకర్ లాంటి దర్శకులతో సినిమాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ పరశురామ్ తన '' మూవీ ఓ ఇంపార్టెంట్ రోల్ చేయాల్సిందిగా పవన్‌ని కోరడంతో వెంటనే ఓకే చెప్పారట. Also Read: బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు, భారీ స్కామ్స్ నేపథ్యంలో 'సర్కారు వారి పాట' కథ రెడీ చేశారు పరశురామ్. ఇందులో మహేశ్ బాబుతో పాటు మరో స్పెషల్ క్యారెక్టర్ ఉందట. కేవలం 5 నిమిషాలే ఉండే ఈ రోల్ కథను మలుపు తిప్పేలా ఉంటుందని, అందుకే ఈ రోల్ పవన్‌తో చేయించి సినిమాకే మేజర్ అట్రాక్షన్ చేయాలని భావించిన పరశురామ్.. ఆయన వద్ద గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారని సమాచారం. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న 'సర్కారు వారి పాట' మూవీ రెగ్యూలర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌‌తో కలిసి మహేశ్ ఈ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించనుంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VCusDB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...