Wednesday, 9 December 2020

‘సలార్’ ఆడిషన్స్: ప్రభాస్ సినిమాలో నటించే లక్కీ ఛాన్స్.. ఇవిగో వివరాలు

‘కె.జి.యఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌, నిర్మాత విజయ్ కిరగందూర్‌తో రెబల్ స్టార్ చేయి కలిపిన సంగతి తెలిసిందే. ‘కె.జి.యఫ్’ మేకర్స్‌తో కలిసి ‘సలార్’ అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందనున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలవుతుంది. అయితే, ఈ చిత్రంలో నటించేందుకు కొత్త నటీనటులను తీసుకుంటున్నారు. ఈ మేరకు చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ప్రకటన చేశారు. నటులు కావాలనుకునేవారికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. See Photos: హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈనెల 15న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆడిషన్స్ జరుగుతాయి. ఆడిషన్స్ పాల్గొనడానికి ఎలాంటి వయో పరిమితి లేదు. ఏ వయసుల వారైనా పాల్గొనవచ్చు. అలాగే, ఏ భాష మాట్లాడేవారైనా తన టాలెంట్‌ను నిరూపించుకోవచ్చు. ఒకే ఒక్క నిమిషం నటించి చూపించాలి. ఆడిషన్స్‌కు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి ఫోన్ నంబర్లు కూడా ఇచ్చారు. Also Read: 9742256454 (ప్రకాష్ రెడ్డి), 9885555464 (చంద్రబాబు), 9000887327 (నందకిశోర్) నంబర్లను కేవలం వాట్సాప్ ద్వారానే సంప్రదించాలని ప్రశాంత్ నీల్ తన ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ తరవాత బెంగళూరు, చెన్నైలోనూ ఆడిషన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. కాగా, ‘సలార్’ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ‘రాధేశ్యామ్’ తరవాత ప్రభాస్ నటించే సినిమా ఇదే. మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ivo1zd
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...