వరుస విజయాలతో ఊపుమీదున్న సూపర్‌స్టార్ ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ‘’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మహేశ్‌బాబు గత సినిమాల రికార్డులన్నింటినీ తిరగరాసింది. ఈ సినిమా తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. 2020లో అత్యధిక హ్యాష్‌ట్యాగ్‌లు సాధించి ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచిన తెలుగు సినిమాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా దేశంలో మూడో స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ జాబితాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆఖరి చిత్రం `దిల్ బెచారా`, సూర్య నటించిన `సూరారై పొట్రు` తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. మరోవైపు 2018లో ‘భరత్ అనే నేను’, 2019లో ‘మహర్షి’ సినిమాలు తెలుగుకు సంబంధించి అత్యధిక హ్యాష్‌ట్యాగ్‌లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. దీంతో ‘సరిలేరు నీకెవ్వరు’ ద్వారా మహేశ్‌బాబు హ్యాట్రిక్ సాధించారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33SQvdV
v
No comments:
Post a Comment