Thursday, 10 December 2020

ఎన్టీఆర్‌‌తో ‘హిట్’ దర్శకుడు.. అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ!!

యంగ్ టైగర్ ప్రస్తుతం RRR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. అంతేకాదు, ఆయనతో సినిమా చేస్తూ మరో చిత్రం చేసే అవకాశం ఉండదు. అందుకే, ఈ సినిమా పూర్తిచేసిన వెంటనే వరుసపెట్టి సినిమాలు చేయడానికి ఎన్టీఆర్ ప్రణాళిక వేసుకుంటున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను ప్రకటించిన ఎన్టీఆర్.. ఇంకొన్ని సినిమాలను లైన్‌లో పెడుతున్నట్టు సమాచారం. కేవలం స్టార్ డైరెక్టర్లతోనే కాకుండా ప్రస్తుతం సత్తా చాటుతున్న ప్రతిభావంతులైన యువ దర్శకులతోనూ సినిమాలు చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారట. దీనిలో భాగంగా యంగ్ డైరెక్టర్స్‌తో ప్రాజెక్టులను ఎన్టీఆర్ లైన్‌లో పెడుతున్నారని ఇండస్ట్రీ టాక్. ఈ లైనప్‌లో ‘హిట్’ దర్శకుడు శైలేష్ కొలను సినిమా కూడా ఉందని అంటున్నారు. ఇటీవలే దిల్ రాజు ద్వారా తారక్‌ను కలిసిన శైలేష్ ఆయనకు ఒక కథ వినిపించారట. ఆ కథ కూడా తారక్‌ను నచ్చిందని వదంతులు వినిపిస్తున్నాయి. మరి ఈ రూమర్‌లో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఎన్టీఆర్‌కు అభిమాని అయిన విశ్వక్ సేన్ హీరోగా ‘హిట్’ అనే క్రైమ్ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు శైలేష్ కొలను. ఈ సినిమాను హీరో నాని నిర్మించారు. డాక్టర్ అయిన శైలేష్ సినిమాలపై ఆసక్తితో దర్శకుడిగా మారారు. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రెండో సినిమానే ఎన్టీఆర్ లాంటి స్టార్‌తో అంటే శైలేష్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR షూట్‌లో పాల్గొంటున్నారు. ఇటీవలే మహాబళేశ్వర్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ప్రస్తుతం పుణే సమీపంలో షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/372vXS8
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...