Thursday, 3 December 2020

ఫుల్ జోష్‌లో యాంకర్ శ్రీముఖి.. కొత్త ఆరంభానికి స్వీకారం! అసలు మ్యాటర్ చెప్పేసిన రాములమ్మ

బుల్లితెర పాపులర్ యాంకర్, సినీ నటి మరో అడుగు ముందుకేసింది. అడపాదడపా సినిమాల్లో నటిస్తూ క్రేజ్ కొట్టేసిన శ్రీముఖి గత సీజన్ బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచి ఫుల్ పాపులర్ అయ్యింది. పటాస్ షో ద్వారా బుల్లితెర ఆడియన్స్ అందరికీ చక్కిలిగింతలు పెట్టి ఫేమస్ యాంకర్‌గా పేరు సంపాదించిన ఆమె.. తాజాగా తన ఫ్యామిలీతో దిగిన పిక్ షేర్ చేస్తూ ఓ ముఖ్యమైన విషయాన్ని రివీల్ చేసింది. కెరీర్‌లో సక్సెస్ అయ్యాక సొంతంగా ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండే కోరిక. తాజాగా ఆ కోరిక తీర్చుకోబుతున్నట్లు తెలిపింది శ్రీ ముఖి. 'కుటుంబ సభ్యులతో కొత్త ఆరంభం' అంటూ తాను ఇల్లు కట్టిస్తున్న పిక్ షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అంతా కనిపిస్తుండటంతో సోషల్ మీడియాలో వెంటనే వైరల్ అయింది. ఇంటి ముందు గుమ్మాన్ని నేడు ప్రతిష్టించినట్టు ఈ ఫొటో చూస్తుంటే అర్థమవుతోంది. ఈ ఇల్లు నిజామాబాద్‌లో కడుతోందని, అన్ని హంగులతో తన ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ఈ ఇల్లు ఉండేలా ఆమె ప్లాన్ చేసుకుందని సమాచారం. Also Read: ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది శ్రీ ముఖి. ''బొమ్మ అదిరింది, ఉమెనియా'' లాంటి షోస్ చేస్తూ తనదైన మాటలతో ఆకట్టుకుంటోంది. ఇక పండగ స్పెషల్ ఈవెంట్లతో ఆమె చేసే హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మరోవైపు వెండితెరపై సత్తా చాటేందుకు విలక్షణ కథలకు ఓకే చెబుతోంది. ప్రస్తుతం 'ఇట్స్ టైమ్ టు పార్టీ' అనే సినిమాలో నటిస్తోంది శ్రీముఖి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3g7K0IT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...