టాలీవుడ్ హీరో, నిర్మాత యాదా కృష్ణ హఠాన్మరణం చెందారు. బుధవారం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. యాదా కృష్ణ వయసు 61 సంవత్సరాలు. 20కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన యాదా కృష్ణ గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆయన చేసినవన్నీ బి గ్రేడ్ సినిమాలే. ‘గుప్త శాస్త్రం’, ‘వయసు కోరిక’, ‘పిక్నిక్’ లాంటి బి గ్రేడ్ సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు యాదా కృష్ణ. కొన్ని చిత్రాలను ఆయనే స్వయంగా నిర్మించారు. Also Read: సోషల్ మీడియాలో యాదా కృష్ణకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. యాదా కృష్ణ చివరిగా ‘సంక్రాంతి అల్లుడు’ సినిమాలో కనిపించారు. ఇది ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయిన యాదా కృష్ణ.. ఆర్థికంగా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. దీంతో సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు హఠాత్తుగా ఆయన కన్నుమూశారనే వార్త ఇండస్ట్రీలో చాలా మందిని షాక్‌కు గురి చేసింది. యాదా కృష్ణ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VqQeKt
v
No comments:
Post a Comment