Friday, 4 December 2020

థియేట‌ర్‌ల‌లో ‘ఒరేయ్‌ బుజ్జిగా’.. ప్రేక్షకులు ఆదరించేనా?

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్‌ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా...’. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌కు కొండా విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అయితే, ఈ సినిమాను ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాత నిర్ణయించారు. థియేటర్లు తెరుచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ‘ఒరేయ్ బుజ్జిగా...’ విడుదల తేదీని నిర్మాత ప్రకటించారు. నూత‌న సంవ‌త్సర కానుక‌గా జ‌న‌వ‌రి 1న ‘ఒరేయ్ బుజ్జిగా...’ థియేట‌ర్‌ల‌లో విడుద‌ల‌వుతుంది. ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎన్ని థియేటర్లు తెరుచుకుంటాయో ఇంకా స్పష్టత లేదు. ఒక వేళ థియేటర్లు తెరుచుకున్నా ప్రేక్షకులు వస్తారే లేదో అనుమానమే. ఇలాంటి పరిస్థితిలో ‘ఒరేయ్ బుజ్జిగా...’కు థియేటర్‌లో ఆదరణ ఎలా ఉంటుందో చూడాలి. కాగా, ‘ఒరేయ్ బుజ్జిగా...’ సినిమాలో వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయలక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధు నందన్ త‌దిత‌రులు న‌టించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. నంద్యాల రవి మాటలు రాశారు. ఐ.ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రవీణ్‌ పూడి ఎడిటర్. శేఖర్‌ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2JPvpWl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...