Thursday, 24 December 2020

నితిన్‌కు పవన్ కళ్యాణ్ క్రిస్మస్ కానుక.. థాంక్యూ సో మచ్ అన్న!

పవర్ స్టార్ తన భార్య అన్నా లెజ్నేవాతో కలిసి ఈ క్రిస్మస్‌ను ఎంతో ఆనందంగా జరుపుకోబోతున్నారు. క్రిస్మస్ సందర్భంగా వీరిద్దరూ తమ సెలబ్రిటీ ఫ్రెండ్స్‌కు, సన్నిహితులకు కానుకలు పంపిస్తున్నారు. పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నేవా తమకు కానుకలు పంపినట్టు సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. వీరిద్దరికీ ఆమె కృతజ్ఞతలు కూడా తెలిపారు. అయితే, ఈ కానుకల ఖాతాలో మరో ఇద్దరు హీరోలు కూడా ఉన్నారు. మహేష్ బాబు కుటుంబంతో పాటు హీరోలు నితిన్, రానా దగ్గుబాటికి కూడా పవన్ కళ్యాణ్ క్రిస్మస్ కానుకలు పంపారు. ఈ విషయాన్ని ఈ ఇద్దరు హీరోలు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. నితిన్ అయితే ఆనందాన్ని పట్టలేకపోయారు. తన అభిమాన నటుడు తనకు క్రిస్మస్ కానుక పంపండంతో ‘థాంక్యూ సో మచ్ అన్న’ అంటూ నితిన్ ఉప్పొంగిపోయారు. ఈ కానుకతో ఈసారి క్రిస్మస్ మరింత సంతోషంగా మారిందని అన్నారు. మరోవైపు రానా దగ్గుబాటి సైతం ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్‌కు, అన్నా లెజ్నేవాకు కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు బండ్ల గణేష్‌కు కూడా పవన్ క్రిస్మస్ కానుక అందింది. కాగా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. ప్రస్తుతం అరకు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక నితిన్ ‘అందాధున్’ రీమేక్‌లో నటిస్తున్నారు. ఆయన నటించిన ‘రంగ్ దే’ విడుదలకు సిద్ధమవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2WGfoVV
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...