Monday, 21 December 2020

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా '5Ws'.. జనవరి రేస్‌లో పాయల్ రాజ్‌పుత్!

Rx100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొత్త సినిమా . 5 డబ్ల్యూస్ అంటే ఎవరు? ఏమిటి? ఎప్పుడు? ఎక్కడ? ఎందుకు? అని అర్థం. '' సాధారణ ప్రశ్నలు, అసాధారణ సమాధానాలు'' అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. గుణశేఖర్ దగ్గర పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పని చేసిన ప్రణదీప్ ఠాకోర్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. కైవల్య క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి యశోద ఠాకోర్ నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ ప్రారంభించిన చిత్రయూనిట్ ఇటీవలే షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. థియేటర్స్ ఓపెన్ కావడంతో జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అతిత్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు ప్రణదీప్ ఠాకోర్, యశోదా ఠాకోర్ మాట్లాడుతూ "ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా చిత్రమిది. పాయల్ రాజ్‌పుత్‌ను సరికొత్త కోణంలో చూపించే సినిమా. నటిగా ఆమెకు పేరు తీసుకొస్తుంది. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన సంఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జనవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Wys7tR
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...