Monday, 14 December 2020

ఆ పాట రాయడానికి 43 రోజులు పట్టింది: అనంత శ్రీరామ్

సినిమాల్లో పాట రాయాలంటే కొన్ని పరిధులు ఉంటాయి. కథకు, సన్నివేశానికి తగినట్లుగా రాయాలంటూ రైటర్స్‌కు దర్శక నిర్మాతలు కండిషన్లు పెట్టే సందర్భాలు ఎదురవుతాయి. అందుకే ఓ పాట గంటలో పూర్తయితే... కొన్ని పాటలు రోజుల తరబడి సమయం తీసుకుంటాయి. తమలోని క్రియేటివీ బయట పెట్టుకునేందుకు అప్పుడప్పుడు రచయితలకు అలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే కష్టానికి ప్రతిఫలంగా ఆ పాటలు రైటర్స్‌కు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి. ‘’ చిత్రం కోసం ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్‌కి ఇలాంటి పరిస్థితే వచ్చింది. సునీల్‌, సలోని జంటగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద రామన్న’ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ సలోని తాను వివాహం చేసుకునే వ్యక్తి ఎలా ఉండాలో ఊహించుకుని బొమ్మలు గీస్తుంటుంది. వాటిని చూసిన కుటుంబ సభ్యులు పిచ్చి గీతలు అంటూ ఏడిపిస్తుంటారు. ఆ బొమ్మల్లో ఏదో విషయం ఉందని హీరో సునీల్ ఆ కుటుంబ సభ్యులను ఇంప్రెస్‌ చేసేలా రాయాల్సిన గీతమిది. Also Read: చాలా క్లిష్టమైన సన్నివేశం కావడంతో ఆ పాట రాయడానికి అనంత శ్రీరామ్‌కు ఏకంగా 43 రోజులు పట్టిందట. కీరవాణి, గీతా మాధురి ఆలపించిన ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట రచయితగా అనంత శ్రీరామ్‌కు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/349hgLb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...