Wednesday, 4 November 2020

Tabu: నా చిన్నతనంలోనే ఆయన! ఆ హీరో కారణం గానే పెళ్లి చేసుకోలేదు.. షాకింగ్ సీక్రెట్స్ రివీల్ చేసిన టబు

టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన సీనియర్ హీరోయిన్ ఇప్పటికీ సింగిల్ గానే ఉన్న సంగతి తెలిసిందే. 50 ఏళ్ల వయసొచ్చినా ఈ బ్యూటీ తన మెడలో మూడు ముళ్ళు వేయించుకోకుండా లేడీ బ్యాచిలర్ గానే ఉన్నారు. కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతూ నేటికీ తన అందంతో అట్రాక్ట్ చేస్తుండటంతో గత కొన్నేళ్లుగా ఆమె పెళ్లి విషయమై అనేక రకాల రూమర్స్ బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో నిన్న (నవంబర్ 4) తన పుట్టినరోజు సందర్భంగా ఓ మీడియాతో ముచ్చటిస్తూ తాను ఎందుకు పెళ్లి చేసుకోలేదనే విషయాన్ని బయటపెట్టారు. ఈ మేరకు ఓ స్టార్ హీరోనే అందుకు కారణం అని టబు చెప్పడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. తాను ఇలా ఒంటరిగా ఉండిపోవడానికి కారణం బాలీవుడ్ హీరో అని చెబుతూ తన నిజ జీవితంలో జరిగిన విషయాలపై ఓపెన్ అయ్యారు టబు. అజయ్ తనకు గత 25 ఏళ్లుగా తెలుసని, ఆయన వల్లే తాను మ్యారేజ్ చేసుకోలేదని చెప్పారు. తన సోదరుడు సమీర్‌కు ఆయన చిన్ననాటి స్నిహితుడని చెప్పిన టబు.. అప్పట్లో జుహూలో తామంతా ఒకే ప్రాంతంలో పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్లమని తెలిపారు. అజయ్, సమీర్ ఓ గ్యాంగ్‌లో తిరిగేవాళ్లనీ.. తన స్నేహితులతో కలిసి వాళ్లను ఆటపట్టించిన సందర్భాలు బోలెడున్నాయని ఆమె అన్నారు. Also Read: అయితే తన టీనేజ్ వయసులో అజయ్ తనమీదే ఎక్కువగా ఫోకస్ పెట్టేవారని, ఏ అబ్బాయి అయినా తనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తే అతన్ని చితక్కొట్టేవారని చెప్పారు టబు. ఇప్పుడు వాళ్లంతా వారి వారి కుటుంబాలతో బిజీగా ఉంటే.. తాను మాత్రం ఇలా సింగిల్‌గా మిగిలిపోయానని పేర్కొన్న టబు.. ఇక తానెందుకు పెళ్లి చేసుకోలేదో మీరే అర్థం చేసుకోండి అని చెప్పడం గమనార్హం. మరోవైపు తనతో పనిచేసిన అందరు హీరోల్లో అజయ్ దేవగన్ తనకు బాగా క్లోజ్ అని టబు పేర్కొన్నారు. ఆయన చాలా ప్రొటెక్టివ్ అని, ఆయన సెట్‌లో ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందని ఆమె చెప్పారు. అజయ్ దేవగన్‌తో కలిసి ''దే దే ప్యార్ దే, దృశ్యం, గోల్‌మాల్ అగైన్, విజయ్‌పథ్, హఖీఖత్'' వంటి సూపర్ హిట్ మూవీస్ చేశారు టబు. ఇప్పటికీ వెండితెరపై అలరిస్తున్న ఆమె ప్రస్తుతం సైదా భాయ్ సినిమాలో నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2I9Fe0V
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...