Saturday, 7 November 2020

వెరీ వెరీ స్పెషల్ సమంత.. ఆమె వేసుకున్న ఈ డ్రెస్‌ ఖరీదు, ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వడం పక్కా!

పెళ్లి తర్వాత మరింత జోష్ పెంచింది అక్కినేని . అక్కినేని వారసుడు నాగ చైతన్యను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. మ్యారేజ్ తర్వాత కెరీర్ పరంగా దూకుడు ప్రదర్శిస్తోంది. సరికొత్తగా అడుగులేస్తూ అక్కినేని అభిమానులకు కిక్కిస్తోంది. మోడ్రన్ టెక్నాలజీ, ఆధునికతతో కలిసి ప్రయాణం చేస్తున్న సామ్ ఇప్పటికే 'సాకి' పేరుతో ఆన్‌లైన్ ఫ్యాషన్ స్టోర్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా హోస్టుగా మరో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించిన సామ్.. ఈ షో ప్రారంభ వేడుకల్లో స్పెషల్ దుస్తుల్లో మెరిసిపోయింది. అవుట్‌ఫిట్ లాంచింగ్‌లో ఇలా అంటూ ఆ డ్రెస్‌తో దిగిన ఫోటో షూట్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది సమంత. ఎలాంటి ఎక్స్‌పోజింగ్‌కి తావివ్వకుండా మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకోవడంతో ఈ డ్రెస్ గురించి ఆరా దీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. పంకజ్‌ అండ్ నిధి లేబుల్‌పై తయారు చేసిన కాన్వా ఫ్లూయిడ్‌ మాక్సీ డ్రెస్‌ ఇది అని సమంత పేర్కొనడంతో దాని ధరపై సెర్చింగ్ మొదలుపెట్టారు. ఆన్‌లైన్‌లో ఈ డ్రెస్ ధర 27,000 రూపాయలుగా కనిపిస్తోంది. Also Read: ఇక సమంత వేసుకున్న ఈ డ్రెస్‌లో మరో ప్రత్యేకత కూడా ఉందట. ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేయడం ద్వారా రూపొందించిన ప్రత్యేక వస్త్రంతో ఈ డ్రెస్ తయారు చేశారట. సమంత శరీరాకృతికి తగ్గట్టుగా ఈ డ్రెస్ ఆమెకు పర్ఫెక్ట్‌గా సూట్ అయిందని అంటున్నారు ఆమె అభిమానులు. మరోవైపు 'సామ్ జామ్' ప్రారంభ వేడుకలోనే ఈ రేంజ్‌ డ్రెస్‌తో ఆకట్టుకుందంటే.. ఇక ఎపిసోడ్స్‌లో సమంత లుక్స్, వేసే డ్రెస్సులు ఏ రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చు అని చెప్పుకుంటున్నారు జనం. సమంత హోస్ట్‌గా ప్రసారం కాబోతున్న 'సామ్ జామ్' ప్రోగ్రామ్‌ను 'ఆహా' ఓటీటీ వేదికపై చూడొచ్చు. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలను సమంత ఇంటర్వ్యూ చేయబోతోంది సమంత. పైగా ''నటిగా నా పదేళ్ల ప్రయాణం ఒకెత్తు.. ఇప్పుడు చేయబోతున్న ఈ కొత్త ప్రయాణం మరో ఎత్తు'' అని సమంతనే స్వయంగా చెప్పడం షో పట్ల జనాల్లో ఉన్న ఆసక్తికి రెక్కలు కట్టింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ibb7Gj
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...