Saturday, 7 November 2020

Amitabh Bachchan: ఏడేళ్ల తర్వాత అబ్బురపరిచే కాంబో.. అజయ్ దేవ‌గణ్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్

సినిమా హీరోలుగా సత్తా చాటుతున్న నటీనటులు నిర్మాతలుగా, దర్శకులుగా కూడా మారి సత్తా చాటడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలామంది హీరోహీరోయిన్లు మెగా ఫోన్ పట్టి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే బాటలో వెళ్లబోతున్నారు బాలీవుడ్ స్టార్ హీరో . గతంలో నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించిన ఆయన ఇక డైరెక్టర్‌గా కూడా విజయాలందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు బడా స్టార్ అమితాబ్‌తో కలిసి ఓ సినిమా రూపొందిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ప్రముఖ సినీ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అజయ్ దేవగణ్, కాంబోలో సినిమా రాబోతోందని, దానికి 'మేడే' అనే టైటిల్ ఫిక్స్ చేశారని తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్‌ నటిస్తూ దర్శకత్వం వహించనుండటం మేజర్ అట్రాక్టివ్ పాయింట్. అంతేగాక ఏకంగా బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ను అజయ్‌ దేవగణ్ డైరెక్ట్ చేయనుండటం జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది. Also Read: హ్యుమన్‌ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్‌లో 'మేడే' రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ కానుంది. ఇకపోతే అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ కాంబోలో దాదాపు ఏడేళ్ల తరువాత మళ్లీ ఈ సినిమానే రానుండటం ప్రేక్షకుల్లో ఆతృత కలిగిస్తోంది. ఈ సినిమాతో అజయ్ దర్శకత్వ ప్రతిభ పూర్తిగా బయటపడనుందని టాక్. గతంలో 2008లో వచ్చిన 'యూ మీ ఔర్ హమ్' సినిమాకు దర్శకత్వం వహించారు అజయ్‌ దేవగణ్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3p6nJPU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...