Wednesday, 25 November 2020

మోహ‌న్‌ బాబు ‘స‌న్ ఆఫ్ ఇండియా’.. ఈ తరహా కథ ఇప్పటి వరకు రాలేదట!

క‌లెక్షన్ కింగ్ డాక్టర్ మోహ‌న్‌ బాబు హీరోగా న‌టిస్తోన్న దేశ‌భ‌క్తి క‌థా చిత్రం ‘స‌న్ ఆఫ్ ఇండియా’. శ్రీ ల‌క్ష్మీప్రస‌న్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ ర‌త్నబాబు ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఇదివ‌ర‌కెన్నడూ క‌నిపించ‌ని అత్యంత ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో మోహ‌న్‌ బాబు న‌టిస్తోన్న ఈ త‌ర‌హా క‌థ కానీ, ఈ జాన‌ర్ సినిమా కానీ ఇప్పటివ‌ర‌కూ టాలీవుడ్‌లో రాలేదని చిత్ర యూనిట్ చెబుతోంది. మొద‌ట తిరుప‌తి షెడ్యూల్‌ను చిత్ర బృందం పూర్తి చేసింది. అక్కడ కొన్ని ముఖ్యమైన స‌న్నివేశాల‌తో పాటు ఓ పాట‌ను చిత్రీక‌రించారు. ఇప్పుడు ఈ సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. బుధ‌వారం హైద‌రాబాద్‌లో ఈ షెడ్యూల్‌ను ప్రారంభించారు. ప్రధాన తారాగ‌ణంపై అధిక భాగం స‌న్నివేశాల‌ను ఈ షెడ్యూల్‌లో చిత్రీక‌రిస్తారు. మోహ‌న్‌ బాబుకు స్టైలిస్ట్‌గా ఆయ‌న కోడ‌లు విరానికా మంచు వ్యవ‌హ‌రిస్తుండ‌టం విశేషం. మోహ‌న్‌ బాబును ఆమె పూర్తిగా స‌రికొత్త రూపంలో చూపిస్తున్నారు. Also Read: మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి స‌ర్వేష్ మురారి సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మోహ‌న్‌ బాబు స్వయంగా స్క్రీన్‌ప్లే స‌మ‌కూరుస్తున్న ఈ సినిమాకు డైమండ్ ర‌త్నబాబు, తోట‌ప‌ల్లి సాయినాథ్ సంభాష‌ణ‌లు రాస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ పాట‌లు రాస్తుండ‌గా, గౌతంరాజు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా చిన్నా ప‌నిచేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3m3JIox
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...