Wednesday, 25 November 2020

స్లిమ్ లుక్‌లోకి మారిపోయిన ప్రభాస్... ఆ సినిమా కోసమేనట!

యంగ్ రెబల్‌ స్టార్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఆరడగులకు పైగా ఎత్తు, కండలు తిరిగిన దేహంతో బాహుబలిగా కనిపించే ప్రభాస్ కొత్త లుక్‌ చూసి అందరూ అవాక్కవుతున్నారు. తాజాగా బయటికొచ్చిన ఫోటోలో సన్నగా, ఫిట్‌గా కనిపిస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇటలీలో ఇటీవలే ఓ షెడ్యూల్ పూర్తి చేశారు. ఆ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల కోసం హైదరాబాద్‌లో ఓ భారీ సెట్ వేస్తున్నారు. దీనికోసమే ఏకంగా రూ.30కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఆ తర్వాత ‘మహానటి’ దర్శకుడు నాగ్అశ్విన్ దర్శకత్వంతో ఓ సినిమాతో పాటు పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్’లోనూ ప్రభాస్ నటించనున్నారు. ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. ఆ సినిమాల కోసమే ప్రభాస్ స్లిమ్ లుక్‌‌లోకి మారినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/39fiHv2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...