Wednesday, 25 November 2020

ఆ వదంతుల్లో నిజం లేదు.. రకుల్ ప్రీత్ సింగ్ మేనేజర్ క్లారిటీ

ప్రస్తుతం పలు సినిమాలతో అస్సలు తీరిక లేకుండా ఉన్న నటీమణుల్లో ఒకరు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలుపుకుని ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. అయితే, రకుల్ ప్రీత్ సింగ్ రాబోయే సినిమాలకు సంబంధించి కొన్ని రూమర్లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై రకుల్ ప్రీత్ మేనేజర్ జి.హరినాథ్ స్పష్టత ఇచ్చారు. ఆ వదంతులన్నీ పచ్చి అబద్ధాలని ఆయన కొట్టిపాడేశారు. క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతోన్న ‘చెక్’ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ అడ్వకేట్‌ పాత్ర పోషిస్తున్నారు. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ రకుల్ ప్రీత్ సింగ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా కనిపించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. తమిళంలో శివకార్తికేయన్ సరసన ఒక సినిమాలో రకుల్ నటిస్తున్నారు. వీటితో పాటు, బాలీవుడ్ సినిమాలను కూడా లైన్‌లో పెట్టారు రకుల్. అర్జున్ కపూర్ సరసన ఒక సినిమాలో నటిస్తుండగా.. జాన్ అబ్రహం హీరోగా వస్తోన్న ‘అటాక్’లో రకుల్ ఒక పాత్ర పోషించారు. ఇటీవలే ‘మే డే’ అనే హిందీ సినిమాను రకుల్ సైన్ చేశారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండటం విశేషం. రకుల్ నటిస్తోన్న ప్రతి సినిమాలోనూ ఆమె ఉత్తమ నటనను కనబరుస్తాననే పూర్తి విశ్వాసంతో ఉన్నారని హరినాథ్ వెల్లడించారు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3nOUjUS
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...