మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ తెలుగు రీమేక్ ఎప్పటి నుంచో వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్ర తెలుగు రీమేక్ హక్కులను సితార ఎంటర్‌టైన్మెంట్స్ కొనుగోలు చేసిన తరవాత రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోలకు ఛాన్స్ ఉండటంతో చాలా మంది స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. మొత్తానికి ఆ వార్తలన్నింటికీ చెక్ పెడుతూ పవర్ స్టార్ ఒక హీరోగా ఈ చిత్రాన్ని ప్రకటించింది సితార ఎంటర్‌టైన్మెంట్స్. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. అంటే, మలయాళంలో బిజు మీనన్ చేసిన పాత్ర. అయితే, పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన ఆర్మీ మాజీ హవల్దార్ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఇంకా ప్రకటించలేదు. కానీ, దీనిపై ఇప్పటికే వదంతులు అయితే వచ్చాయి. ఆ పాత్రను కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ చేయనున్నారని అన్నారు. ఆ తరవాత యంగ్ హీరో రానా దగ్గుబాటి పేరు వినిపించింది. అయితే, తాజాగా మరో స్టార్ హీరో పేరు తెరపైకి వచ్చింది. మాజీ హవల్దార్ పాత్ర కోసం మ్యాచో హీరో గోపీచంద్‌ను మేకర్స్ సంప్రదించారని వదంతులు వినిపిస్తున్నాయి. అయితేనే ఆర్మీ పర్సన్ పాత్రకు కరెక్ట్‌గా సరిపోతారని దర్శకుడు సాగర్ భావించారట. అంతేకాకుండా, పవన్ కళ్యాణ్‌తో పోటీ పడాలంటే సీనియారిటీ ఉన్న గోపీచంద్‌ను తీసుకోవడం మంచిదని చిత్ర యూనిట్ భావిస్తోందని అంటున్నారు. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రానికి ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38PxMmL
v
No comments:
Post a Comment