Monday, 16 November 2020

‘లవ్‌స్టోరీ’కి బై బై.. ‘థాంక్యూ’ చెప్పనున్న నాగచైతన్య

అక్కినేని వారసుడు నాగచైతన్య దూకుడు పెంచారు. వరుస సినిమాలను లైన్లో పెడుతూ మిగతా హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయిపల్లవితో కలిసి ఆయన నటించిన ‘లవ్‌ స్టోరీ’ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి చేస్తూ మరో చిత్రానికి ఆయన పచ్చజెండా ఊపేశారు. ‘మనం’ ఫేమ్ డైరెక్ట్ చేయబోయే ఈ సినిమాకు ‘’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. దిల్ రాజు నిర్మాత. Also Read: ఇందులో కథ రీత్యా ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారు. ఇప్పటికే ‘గ్యాంగ్ లీడర్’ ఫేమ్ ప్రియాంక మోహన్‌ను ఎంపిక చేయగా.. మిగిలిన ఇద్దరి కోసం యూనిట్ కసరత్తులు చేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని డిసెంబర్‌ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ జరుపుకునేలా చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈలోగా నాగచైతన్య తన ‘లవ్‌స్టోరీ’కి ముగింపు పలికి ‘థాంక్యూ’ టీమ్‌లో చేరనున్నాడు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2IHgyNG
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...