Monday, 16 November 2020

‘మీరే అలా చేస్తే ఎలా’.. చిరంజీవిపై వైద్యశాఖ ఆగ్రహం, కారణం అదేనట!

తన జీవితంలో ఆడేసుకుందంటూ మెగాస్టార్‌ చెప్పిన సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభించే క్రమంలో కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చిందని ఆయన ఈ నెల 9వ తేదీన సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు కూడా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అయితే రోజులు గడుస్తున్నా తనకు ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో మూడుసార్లు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చిందని ఆయనే స్వయంగా ప్రకటించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అంతా బాగానే ఉందనుకుంటున్న సమయంలోనే చిరంజీవి తీరుపై వైద్య, ఆరోగ్య శాఖ మండిపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా పాజిటివ్ అని తేలిన వారందరూ కచ్చితంగా రెండు వారాల పాటు క్వారంటైన్‌లో ఉండాలన్న నిబంధన ఉంది. అయితే చిరంజీవి మూడు రోజులు క్వారంటైన్‌లో ఉండి ఆ తర్వాత నెగిటివ్ వచ్చిందటూ బయట తిరగడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. దీపావళి సందర్భంగా ఆయన గురువు, కళాతపస్వి కె విశ్వనాథ్‌ ఇంటికి సతీసమేతంగా వెళ్లిన చిరంజీవి ఆయన్ని సత్కరించారు. Also Read: ఈ ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చిరంజీవికి మెసేజ్ చేసినట్లు తెలుస్తోంది. ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్’ నిబంధనల ప్రకారం కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి కచ్చితంగా రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండాలని, నెగిటివ్ వచ్చిందని ఇష్టారీతిన బయట తిరగకూడదని ఆ మెసేజ్‌లో వెల్లడించారట. సెలబ్రెటీ అయిన మీరే ఇలా చేస్తే సామాన్య ప్రజలు నిబంధనలు పాటిస్తారా? అని అధికారులు చిరంజీవిని సున్నితంగా నిలదీసినట్లు తెలుస్తోంది. దీనిపై చిరంజీవి నుంచి గానీ, వైద్యశాఖ అధికారులు నుంచి గానీ ఎలాంటి క్లారిటీ రాలేదు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/38Vku8p
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...