Friday, 27 November 2020

అనుపమా పరమేశ్వరన్ బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక డేటింగ్!

కన్నడ బ్యూటీ రష్మిక మందనకు ప్రస్తుతం సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. స్టార్ హీరోయిన్ హోదాను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవలే ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా నిలిచి మరింత పాపులారిటీని సంపాదించింది. అయితే, రష్మిక గురించి ప్రస్తుతం ఓ వార్త హాట్ టాపిక్‌గా మారింది. అది ఆమె రిలేషన్‌షిప్ గురించి. మలయాళ దర్శకుడు, నిర్మాత చిరంజీవ్ మక్వానాతో రష్మిక రిలేషన్‌షిప్‌లో ఉన్నారట. ఈ విషయాన్ని ప్రముఖ ఫిలింస్ డాటాబేస్ సంస్థ ఐఎండీబీ స్పష్టం చేస్తోంది. ఐఎండీబీలో బయోగ్రఫీలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నిజానికి అనుమపమా పరమేశ్వరన్ ప్రియుడు చిరంజీవ్ మక్వానా అని ప్రచారంలో ఉంది. అందుకనే, బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక మందన రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఐఎండీబీలో అప్‌డేట్ చేశారు. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే రష్మికనో లేదంటే చిరంజీవ్ మక్వానానో స్పందించే వరకు ఆగాల్సిందే. నిజానికి కన్నడ ఇండస్ట్రీ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన రష్మిక మందన.. ‘‘కిర్క్ పార్టీ’’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ చిత్ర హీరో, దర్శకుడు రక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమలో పడ్డారు. ఆయనతో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, ఆ తరవాత వ్యక్తిగత కారణాలతో రక్షిత్ శెట్టితో పెళ్లిని రద్దు చేసుకున్నారు రష్మిక. టాలీవుడ్‌లో రష్మిక బాగా రాణిస్తుండటంతో ఆ జర్నీని కొనసాగించాలనే ఉద్దేశంతోనే రక్షిత్ శెట్టి నుంచి రష్మిక విడిపోయారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. Also Read: ఆ తరవాత విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమాలో నటించిన రష్మిక మందన ఆయనతో రిలేషన్‌షిప్‌లో ఉందనే ప్రచారం జరిగింది. ఈ వదంతులను అటు రష్మిక, ఇటు విజయ్ దేవరకొండ ఖండించారు. అయితే, ఇప్పుడు అనుపమా పరమేశ్వర్ బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక మందన డేటింగ్ చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36a3Yj0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...