Friday, 27 November 2020

ఆయనంటే చాలా ఇష్టం.. ఆ స్టార్ హీరో పెళ్లయిందని తెలిసి ఏడ్చేశా.. ఓపెన్ అయిన మంచు లక్ష్మి

మంచు మోహన్ బాబు డాటర్, సినీ నటి ఇంటర్వ్యూ ఇచ్చిందంటే అందులో ఉండే కిక్కే వేరు. ఇంగ్లీష్, తెలుగు పదాలను కలిపి వాడుతూ తనదైన స్టైల్ మాటలతో అట్రాక్ట్ చేస్తుంటారామె. అందుకే ఈ మంచువారమ్మాయి మాటలను చాలా శ్రద్దగా వింటుంటారు ప్రేక్షకులు. పైగా సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు సమాజంలో జరిగే విషయాలపై రియాక్ట్ అయ్యే ఆమె.. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను బయటపెడుతూ ఆసక్తికర సంగతులు చెప్పారు. రీసెంట్‌గా మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ ఓ హీరోకు పెళ్లి అయిందని తెలియడంతో ఏడ్చానని చెప్పి ఆశ్చర్యపర్చారు. ఆ హీరో మరెవరో కాదు అని, ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ అని తెలిపారు. అయితే ఆయన పెళ్లి చేసుకున్నాడని తెలిశాక చాలా బాధ అనిపించిందని చెప్పిన ఈ మంచువారమ్మాయి.. ఆమిర్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్న సమయంలోనూ ఏడ్చేశానని చెప్పడం విశేషం. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ సినిమాలను ఎంచుకునే విధానం తనకు బాగా నచ్చుతుందని ఆమె పేర్కొన్నారు. ఇక తెలుగు హీరోల విషయానికొస్తే తాను నాగార్జునకు వీరాభిమానిని అని మంచు లక్ష్మి అన్నారు. అందుకే ఎప్పుడైనా ఆమిర్ ఖాన్, పేర్లు వింటే ఏదో అయిపోతుందని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో మంచు లక్ష్మి చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో క్లిప్ చూసి పలు రకాలుగా రియాక్ట్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. Also Read: 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమైన మంచు లక్ష్మి ఆ తర్వాత ''గుండెల్లో గోదారి, చందమామ కథలు, దొంగాట, ఊకొడతారా ఉలిక్కిపడతారా, లక్ష్మి బాంబ్'' వంటి విభిన్న చిత్రాలతో అలరించారు. బుల్లితెరపై కూడా పలు షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సత్తా చాటుతున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3o3Xybo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...