Wednesday, 4 November 2020

ఘనంగా రఘు కుంచె కూతురి వివాహం.. చిరంజీవి సందడి

గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఈ ఏడాది ‘పలాస 1978’ చిత్రంతో నటుడిగా, సంగీత దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన మంచి విజయాన్ని అందుకున్నారు. ఇదిలా ఉంటే, రఘు కుంచె కుమార్తె రాగ పుష్యమి వివాహం అక్టోబర్ 29న ఆశిష్ వర్మతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించి ఇప్పటికే పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. కాగా, ఈ పెళ్లిలో మెగాస్టార్ కూడా పాల్గొన్నారు. ఈ విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది. రాగ పుష్యమి, ఆశిష్ వర్మ వివాహ వేడుకలో చిరంజీవి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన ఫొటోలను రఘు కుంచె బుధవారం విడుదల చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిరంజీవి బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోతున్నారు. అలాగే, వధూవరులు రాగ, ఆశిష్ కూడా చూడముచ్చటగా ఉన్నారు. మరోవైపు, చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా ఆగిన ఈ చిత్ర షూటింగ్ పునఃప్రారంభంకానుంది. న‌వంబ‌ర్ 9 నుండి ‘ఆచార్య’ షూటింగ్ ప్రారంభిస్తున్నట్టు చిత్ర యూనిట్ బుధవారం ప్రకటించింది. సుధీర్ఘంగా జరిగే ఈ షెడ్యూల్‌లో సినిమాకు సంబంధించిన ప్రధాన భాగం పూర్తవుతుంది. కొవిడ్ నేప‌థ్యంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా షూటింగ్‌ను పూర్తి చేయ‌డానికి అవ‌స‌ర‌మైన జాగ్రత్తలను తీసుకుంటున్నట్టు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3mS75Bt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...