తెలుగు బుల్లితెర ప్రపంచంలోని స్టార్ యాంకర్లలో ఒకరు. బుల్లితెర రాములమ్మగా తనకంటూ ప్రత్యేకమైన పాపులారిటీ సంపాదించుకున్నారు శ్రీముఖి. బిగ్ బాస్ షోలో పాల్గొన్న తరవాత శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగిపోయింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండటంతో ఆమెకు ఫాలోవర్లు కూడా చాలా ఎక్కువే. వీళ్లలో చాలా మంది శ్రీముఖి పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే, ఆ సమయం దగ్గరపడిందని సమాచారం. శ్రీముఖి రిలేషన్‌షిప్‌కు సంబంధించి ప్రస్తుతం ఓ క్రేజీ రూమర్ మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. శ్రీముఖి ప్రేమలో పడ్డారట. తన పార్ట్‌నర్‌ను ఆమె ఎంపిక చేసుకున్నారని.. ఆయనతో ప్రస్తుతం శ్రీముఖి డేటింగ్ చేస్తున్నారని అంటున్నారు. అయితే, ఆ మిస్టర్ పర్ఫెక్ట్ ఎవరు అనే విషయం మాత్రం ఎవరికీ తెలీదు. నిజానికి తాను ప్రేమ వివాహం చేసుకోనని.. ఇంట్లో అమ్మానాన్న చూసిన అబ్బాయినే చేసుకుంటానని ఆ మధ్య శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక వేళ తాను ఎవరినైనా ఇష్టపడితే ముందు అమ్మానాన్నకు చెబుతానని.. వాళ్లు ఓకే చెబితేనే ముందడుగు వేస్తానని కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ఇప్పుడు శ్రీముఖికి ఇష్టమైన అబ్బాయి దొరికేశారా? ప్రస్తుతం వినిపిస్తోన్న వదంతులు నిజమేనా? అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఇదిలా ఉంటే, ప్రస్తుతం శ్రీముఖి ‘బొమ్మ అదిరింది’ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే, తాను వ్యాఖ్యాతగా ‘ఓ ఉమెనియా’ అనే టాక్ షోను నిర్వహిస్తున్నారు. ఇది శ్రీముఖి సొంత షో. ఆమె యూట్యూబ్ ఛానెల్‌లోనే పబ్లిష్ చేస్తున్నారు. ఈ షోలతో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నారు శ్రీముఖి. ప్రస్తుతం ఆమె ఒక థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3lFEr6r
v
No comments:
Post a Comment