Tuesday, 24 November 2020

ఎన్టీఆర్ సరసన రష్మిక?... లక్కీఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ

కన్నడ బ్యూటీ రష్మిక మందానాకి ఇప్పుడు గోల్డెన్ టైమ్ నడుస్తోంది. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ అగ్ర హీరోయిన్‌గా ఎదుగుతోంది. ఇప్పటికే పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’లో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక.. తమిళంలో హీరో సూర్యతోనూ రొమాన్స్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో రష్మికను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. Also Read: ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమాలో నటించనున్నారు. దీనికోసం ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తిచేసుకుని త్రివిక్రమ్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోయిన్‌గా రష్మికను తీసుకునే యోచనలో యూనిట్ ఉన్నట్లు సమాచారం. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుండగా... రష్మిక, కియారా అద్వానీల్లో ఒకరిని ఫైనల్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడున్న క్రేజ్‌ ప్రకారం రష్మికకే ఎక్కువ ఛాన్స్ ఉండేలా కనిపిస్తోంది. మరో హీరోయిన్‌ కోసం ఢిల్లీకి చెందిన ఓ కొత్త హీరోయిన్‌ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పక్కన నటించే లక్కీ ఛాన్స్ ఎవరు దక్కించుకుంటారో చూడాలి మరి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33hjZSp
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...