యాంకర్, నటి భరద్వాజ్ గర్భం దాల్చారు. ఈ విషయాన్ని సుప్రీమ్ హీరో బయటపెట్టారు. అనసూయ గర్భం దాల్చారు అంటే నిజ జీవితంలో కాదండోయ్.. సినిమాలో! అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రానా దగ్గుబాటి ఆవిష్కరించారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు నటీనటులను పరిచయం చేసే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సాయి ధరమ్ తేజ్ ఆవిష్కరించారు. ప్రియ, అభిలను పరిచయం చేశారు. Also Read: ఈ పోస్టర్‌లో ఒక లిఫ్ట్‌లో అనసూయ భరద్వాజ్ ప్రెగ్నెంట్ లుక్‌లో, చేతిలో ఫేస్ మాస్క్ పట్టుకొని కోపంగా చూస్తున్నట్లు కనిపిస్తుంటే.. ఆమె వెనకే మరో ప్రధాన పాత్రధారి అశ్విన్ విరాజ్ సీరియస్ లుక్‌లో నిలబడి కనిపిస్తున్నారు. ఒకరి వెనుక ఒకరు నిల్చొని, పరస్పరం చూసుకుంటున్న తీరు చూస్తుంటే ఆ ఇద్దరి మధ్య ఏదో గొడవ ఉన్నట్లు అనిపిస్తోంది. టైటిల్ పోస్టర్ రివీల్ అయినప్పుడు సినిమా కథకు, లిఫ్ట్‌కు ఏదో సంబంధం ఉందనే విషయం అర్థమైంది. ఇప్పుడు ఆ లిఫ్ట్‌లో అనసూయ, విరాజ్ ఎడముఖం పెడముఖం పెట్టుకొని నిల్చొని కనిపించడంతో సినిమా కంటెంట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఉత్కంఠభరిత అంశాలతో ఒక డ్రామ్ ఫిల్మ్‌గా ‘థ్యాంక్ యు బ్రదర్’ను నూతన దర్శకుడు రమేష్ రాపర్తి రూపొందిస్తున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది. Also Read: జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందించగా.. గుణ బాలసుబ్రమణియన్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూరుస్తున్నారు. షూటింగ్ పూర్తయిన ‘థ్యాంక్ యు బద్రర్’ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రంలో ఇంకా వైవా హర్ష, అర్చనా అనంత్, అనీష్ కురువిల్లా, మౌనికా రెడ్డి, ఆదర్శ్ బాలకృష్ణ, కాదంబరి కిరణ్, అన్నపూర్ణ, బాబీ రాఘవేంద్ర, సమీర్ నటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33maroW
v
No comments:
Post a Comment