Thursday, 5 November 2020

హాలీవుడ్‌కు వెళ్లనున్న హృతిక్‌ రోషన్.. స్పై థ్రిల్లర్‌‌తో యాక్షన్ హంగామా

గ్రీక్ గాడ్‌గా అభిమానులతో పిలిపించుకునే కండల వీరుడు హృతిక్‌ రోషన్‌ త్వరలోనే హాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నాడు. బాలీవుడ్‌లో మోస్ట్ స్టైలిష్‌ హీరోగా కనిపించే హృతిక్‌‌ను ఎప్పటినుంచో సినిమాలో చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడా కోరిక తీరే సమయం వచ్చేసినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థకు, హృతిక్‌కు మధ్య చర్చలు జరుగుతున్నాయని బాలీవుడ్‌ టాక్. దీని కోసం హృతిక్‌ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. Also Read: హాలీవుడ్‌‌లో అడుగుపెట్టేందుకు హృతిక్‌ అమెరికాకు చెందిన గెర్ష్‌ ఏజెన్సీతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ప్రయత్నాలు ఫలించి హాలీవుడ్‌కు చెందిన ఓ బడా నిర్మాణ సంస్థ ఆయనతో చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చిందని సమాచారం. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టుపై హృతిక్‌ చాలా ఆసక్తి చూపిస్తున్నారట. ప్రస్తుతం ఆయన ఇంటినుంచే అడిషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సినిమా ఓకే అయితే ‘క్రిష్-4’ షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TXhtvB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...