Thursday, 5 November 2020

వేదాళం రీమేక్‌కు ముహూర్తం ఫిక్స్?.. డైరెక్టర్‌కి చిరు పిలుపు

మెగాస్టార్ మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి ‘ఆచార్య’ సెట్‌లో ఆయన అడుగు పెట్టనున్నారు. డిసెంబర్ ఆఖరికల్లా సినిమా షూటింగ్‌ పూర్తిచేయాలని దర్శకుడు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట. దీంతో మిగిలిన భాగాన్నంతా ఒకే షెడ్యూల్‌లో పూర్తిచేయాలని యూనిట్ భావిస్తోంది. మరోవైపు చిరు వేదాళం రీమేక్ సినిమా కూడా ఈ నెలలో ప్రారంభం కానుంది. దీనికోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ పాత్రకు కీర్తి ఓకే చెప్పేసినట్లు వార్తలొచ్చినా యూనిట్ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. సంక్రాంతి తర్వాతి నుంచి షూటింగ్ ప్రారంభిచేలా ప్లాన్ చేసుకోవాలని మెహర్ రమేష్‌కి చిరు సూచించారట.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34ZIzIy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...