Monday, 2 November 2020

ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉండండి.. అప్‌డేట్ ఇచ్చిన నితిన్

యంగ్ హీరో , తొలిసారి కలిసి నటిస్తోన్న చిత్రం ‘రంగ్ దే’. ‘తొలి ప్రేమ’, ‘మజ్ను’ వంటి ప్రేమకథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. మంచి కామెడీ టచ్‌తో టీజర్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమాకు కూడా ఇంతే హిలేరియస్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ‘రంగ్ దే’ను రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా దర్శకుడు వెంకీ తీర్చిదిద్దుతున్నారు. లాక్‌డౌన్ విరామం తరవాత హైదరాబాద్‌లో షూటింగ్ ప్రారంభించి నితిన్‌తో పాటు ఇతర ప్రధాన తారాగణంపై సన్నివేశాలు చిత్రీకరించారు. Also Read: మరికొన్ని కీలక సన్నివేశాలు, ఇటలీలో పాటల చిత్రీకరణతో త్వరలోనే షూటింగ్ పూర్తవుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. కాగా, ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్‌డేట్ ఇచ్చారు నితిన్. ఇది ప్రేక్షకులను ప్రేమలో పడేసే అప్‌డేట్ అట. దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే రిఫ్రెషింగ్ ట్యూన్‌తో ప్రేమలో పడటానికి సిద్ధంగా ఉండండి అని నితిన్ ట్వీట్ చేశారు. ఈ సినిమాలోని ‘ఏమిటో ఇది’ అనే పాట ట్యూన్‌ను ఈనెల 5న సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేస్తున్నట్టు నితిన్ ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సుప్రసిద్ధ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సీనియర్ నటుడు నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2HTrc36
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...