Thursday, 19 November 2020

అది యాక్సిడెంట్ కాదు.. నా హత్యకు కుట్ర: ఖుష్బూ సంచలన ఆరోపణ

తమిళ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ ప్రయాణిస్తున్న కారు బుధవారం ఉదయం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కడలూరులో జరిగే వేల్ యాత్రలో పాల్గొనేందుకు వెళ్తుండగా చెన్నై-తిరుచ్చి జాతీయ రహదారిపై మదురాంతకం సమీపంలో ఆమె కారును ఓ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ఓ వైపు నుజ్జునుజ్జు కాగా ఖుష్బూ అందులో ఇరుక్కుపోయారు. డ్రైవర్ మురుగన్ స్థానికుల సాయంతో ఆమెను కారు నుంచి వెలికితీశారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మదురాంతకం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఖుష్బూను విచారించారు. అయితే ఈ ప్రమాదంపై స్పందించిన .. ఇది ప్రమాదం కాదని, తనను హత్య చేయడానికి జరిగిన కుట్ర అని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయన్నారు. తాను బీజేపీలో చేరినప్పటి నుంచి బెదిరింపులు ఎక్కువయ్యాయని, వాటికి తాను భయపడనని పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UEJmcb
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...