Friday, 20 November 2020

సమంత ‘సామ్ జామ్’.. చిరంజీవికి భారీ మొత్తం చెల్లిస్తోన్న అరవింద్!

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్థాపించిన అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ తన బిజినెస్‌ను మరింత విస్తరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా దీపావళి నుంచి కొత్త తరహా ప్రచారాన్ని మొదలుపెట్టారు అరవింద్. అల్లు అర్జున్‌తో ‘ఆహా’ను ప్రమోట్ చేయిస్తున్నారు. అలాగే, స్టార్ హీరోయిన్ సమంతతో ‘సామ్ జామ్’ అనే టాక్ షోను ప్లాన్ చేశారు. ఒక భారీ ఈవెంట్ పెట్టి ఈ షోను అనౌన్స్ చేశారు. విజయ్ దేవరకొండ, , తమన్నా, అల్లు అర్జున్, రష్మిక మందన వంటి స్టార్లు ఈ షోలో పాల్గొనబోతున్నారని ప్రకటించారు. తొలి ఎపిసోడ్‌లో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అతిథిగా వచ్చారు. కానీ, ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ‘సామ్ జామ్’ ఫ్లాప్ అంటూ విమర్శలు మొదలైపోయాయి. అందుకే అల్లు అరవింద్.. చిరంజీవిని రంగంలోకి దించారట. నిజానికి చిరంజీవి ఎపిసోడ్‌ను గ్రాండ్ ఫినాలేగా డిజైన్ చేశారట. కానీ, షోపై ప్రస్తుతం నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో దాన్ని మార్చడానికి ఇప్పుడు చిరంజీవి ఎపిసోడ్‌ను ముందుకు తీసుకొచ్చారని రూమర్స్ వినిపిస్తున్నాయి. Also Read: అంతేకాదు, చిరంజీవిని ఈ షోకు తీసుకురావడానికి అల్లు అరవింద్ భారీ మొత్తం చెల్లించారని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అది ఎంత మొత్తం అనే విషయం బయటకు రాలేదుకానీ ఎక్కువేనని టాక్. చిరంజీవి ‘సామ్ జామ్’ షోలో పాల్గొనడానికి వెళ్తున్న స్టిల్స్, షోలో పాల్గొన్న ఫొటోలు నిన్న సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, చిరు ఈ షోకు ఎంతగా ఉపయోగపడతారో చూడాలి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fhtTYK
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...