దర్శకుడు శ్రీను వైట్ల కెరీర్‌లో ‘ఢీ’ సినిమా ఒక మలుపు. శ్రీను వైట్ల అప్పటికే రవితేజతో ‘వెంకీ’, చిరంజీవితో ‘అందరివాడు’ సినిమాలు చేసినప్పటికీ ‘ఢీ’ సినిమా ఆయన మార్కెట్‌ను పెంచింది. 2007లో వచ్చిన ఈ సినిమా కెరీర్‌లోనూ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే, 13 ఏళ్ల తరవాత ఇప్పుడు ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతోంది. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘‘కొన్ని వేల మంది సినీ ప్రేమికులకు ‘ఢీ’ ఒక ఫేవరేట్ ఫిలిం. ఈ సినిమాకు పనిచేసిన కాస్ట్, క్రూ అందరి జీవితాలు మారిపోయాయి. ఆ సమయంలో సినిమాల్లో కొత్త ఒరవడికి ఈ చిత్రం కారణమైంది. ‘ఢీ’ కంటే గొప్పగా ఏం తీయగలం?’’ అని మంచు విష్ణు పేర్కొన్నారు. అంతేకాదు, తన పుట్టినరోజు అయిన నవంబర్ 23న ఈ చిత్రానికి సంబంధించి ప్రకటన చేయనున్నారు. అయితే, ఇది ‘ఢీ’కి సీక్వెల్ అయ్యుంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, ‘ఢీ’ సినిమా తరవాత ‘రెడీ’ లాంటి బ్లాక్ బస్టర్‌తో డైరెక్టర్ శ్రీను వైట్ల తన మార్కెట్‌ను అమాంతం పెంచుకున్నారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. ఇక ‘దూకుడు’, ‘బాద్ షా’ హిట్లతో శ్రీను వైట్ల రేంజ్ మరింత పెరిగింది. కానీ, ఆ తరవాత వరుస పరాజయాలతో శ్రీను వైట్ల బాగా వెనకడిపోయారు. ‘ఆగడు’ సినిమా శ్రీను వైట్ల ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేసింది. 2018లో రవితేజతో కలిసి చేసిన ‘అమర్ అక్బర్ ఆంటొని’ కూడా నిరాశపరిచింది. దీంతో రెండేళ్ల విరామం తరవాత ఇప్పుడు మంచు విష్ణుతో కలిసి సినిమాను ప్రకటించబోతున్నారు శ్రీను వైట్ల. మరోవైపు, మంచు విష్ణుకు కూడా గడిచిన కొన్నేళ్లలో ఒక్క హిట్టు కూడా లేదు. ఇద్దరికీ ఈ సినిమా కీలకమే. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33jlZJZ
v
No comments:
Post a Comment