Tuesday, 3 November 2020

మ్యూజిక్ డైరెక్టర్ కోటి ముఖ్యపాత్రలో 'సెహరి'.. దిల్ రాజు క్లాప్‌తో మూవీ లాంచ్

సీనియర్ సంగీత దర్శకుడు కోటి ముఖ్యపాత్ర పోషించనున్న కొత్త సినిమా ''. నేడు హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అల్లు బాబీ, ఏషియన్ సినిమాస్ భరత్ నారంగ్ ముఖ్య అథిదులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు బాబీ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. క్లాప్ కొట్టారు. దర్శకనిర్మాతలకు భరత్ నారంగ్ స్క్రిప్ట్ అందించారు. నూతన దర్శకుడు జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో హర్ష కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అద్వయ జిష్ణు రెడ్డి, శిల్పా చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విర్గో పిక్చర్స్ బ్యానర్‌పై ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ రూపొందనుంది. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. అభినవ్ గోమాతమ్, ప్రణీత్ రెడ్డి, అనిషా అల్లా, అక్షిత హరీష్, కోటి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆసక్తికర కథాంశంతో ఈ 'సెహరి' మూవీ రూపొందిస్తున్నామని చిత్రయూనిట్ చెప్పింది. త్వరత్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుంచుతామని చెప్పిన దర్శకనిర్మాతలు తమ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకముందని అన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3kUB62X
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...