టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత వ్యాఖ్యాతగా ‘సామ్ జామ్’ అనే కార్యక్రమంలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆహా’ యాప్ తన సబ్‌స్క్రైబర్లను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా సమంతతో ఈ షో చేయిస్తోంది. దీనిలో భాగంగా ప్రముఖ సినీ సెలబ్రెటీలను సమంత ఇంటర్వ్యూ చేస్తున్నారు. నవంబర్ 13న ఈ షో ప్రారంభం కాగా.. తొలి అతిథిగా విజయ్ దేవరకొండ వచ్చారు. తర్వాత వచ్చే ఎపిసోడ్లతో తమన్నా, రష్మిక మందానా, అల్లు అర్జున్ తదితరులు గెస్ట్‌లుగా ఈ షోలో సందడి చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. Also Read: ఈ క్రమంలోనే మెగాస్టార్ కూడా ‘సామ్ జామ్’లో సందడి చేయనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అనుకున్నట్లుగానే మెగాస్టార్ ఈ షోలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ సినీ పీఆర్వో బీఏ రాజు తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. చిరు ఎపిసోడ్ త్వరలోనే ‘ఆహా’లో ప్రసారం కానుంది. సమంత ఏయే ప్రశ్నలు అడిగిందో.. వాటికి మెగాస్టార్ ఏ సమాధానాలు చెప్పారో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UD6PdC
v
No comments:
Post a Comment