కిందటేడాది వచ్చిన అడల్ట్ హారర్ కామెడీ ఫిలిం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమా హాట్ టాపిక్ అయ్యింది. తమిళంలో తెరకెక్కిన ‘ఇరుత్తు అరియిల్ మురత్తు కూత్తు’ సినిమాకు ఇది రీమేక్. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘చితక్కొట్టుడు 2’ వస్తోంది. మొదటి సినిమాతో పోలిస్తే దీనిలో బూతు డోసు ఎక్కువగానే ఉన్నట్టు ఈరోజు విడుదలైన ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతోంది. మొదటి వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సంతోష్ పి జయకుమార్ ఈ రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్లైయింగ్ హార్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. హరి భాస్కర్ నిర్మిస్తున్నారు. తమిళంలో ‘ఇరాండమ్ కూత్తు’గా వస్తోన్న ఈ చిత్రం తెలుగులో ‘చితక్కొట్టుడు 2’గా వస్తోంది. ‘చితక్కొట్టుడు 2’ని గతంలో వచ్చిన అడల్ట్ హరర్ కామెడీల కంటే మరింత ఎంటర్‌టైనింగ్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు దర్శకుడు సంతోష్ పి జయకుమార్ తెలిపారు. అంతేకాదు, ఈ చిత్రంలో ఆయనే స్వయంగా హీరోగా నటించడం విశేషం. సంతోష్‌కి జోడిగా కరిష్మా, మీనల్, ఆకృతి సింగ్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా విడుదల చేసిన ‘చితక్కొట్టుడు 2’ ఫస్ట్ లుక్‌లో రొమాంటిక్ ఆడియెన్స్‌కి కావాల్సిన అంశాలతో పాటు అడల్ట్ కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉండేలా డిజైన్ చేశారు దర్శకుడు సంతోష్ పి జయకుమార్ అండ్ టీమ్. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా హీరో కమ్ డైరెక్టర్ సంతోష్ పి జయకుమార్ తెలిపారు. నటీనటులు హీరో - సంతోష్ పి జయకుమార్ హీరోయిన్ - మీనల్, కరీష్మా, ఆకృతి సింగ్ కమెడియన్లు - రవి మారియ, ఛామ్స్, డానీ, టీఎస్కే, షల్లు షాము, లొల్లు షబా మనోహర్, లొల్లు షబా స్వామీనాథన్, సింగమ్ పులి Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TSBcfN
v
No comments:
Post a Comment