మెగా పవర్ స్టార్ , యంగ్ టైగర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న మూవీ షూటింగ్ మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. సెట్స్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బంది మళ్లీ తమ పనిని మొదలుపెట్టినట్టు చెప్పే చిన్న వీడియోను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను అక్టోబర్ 22న విడుదల చేయనున్నట్టు కూడా ఈ వీడియోలో ప్రకటించారు. కొమరం భీమ్‌ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎన్టీఆర్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే, బాలీవుడ్ బ్యూటీ నవంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని సమాచారం. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోన్న షూటింగ్‌లో ఆమె పాల్గొంటారని, ఆమె షెడ్యూల్ పూర్తయ్యేంత వరకు నగరంలోనే ఉంటారని తెలుస్తోంది. ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనిపిస్తుండగా.. ఆమె పక్కన సీతగా ఆలియా భట్ నటిస్తున్నారు. ఇక అజయ్ దేవగణ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘బాహుబలి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరవాత రాజమౌళి నుంచి వస్తోన్న చిత్రం కావడంతో RRR భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. నిజానికి ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని భావించారు. కానీ, కరోనా అడ్డుపడింది. మరో విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది. ఈ చిత్రానికి యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. Also Read:
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/36HtgFW
v
No comments:
Post a Comment