Wednesday, 7 October 2020

సుధీర్ బాబు భార్య బర్త్‌డే: ఒకే ఫ్రేమ్‌లో ఘట్టమనేని ఫ్యామిలీ.. మహేష్ బాబు లుక్ వైరల్

ఘట్టమనేని కుటుంబ సభ్యులంతా ఒక దగ్గరికి చేరారు. నటశేఖర కృష్ణ తన కూతుళ్లు, అల్లుళ్లు, కొడుకు, కోడలు, మనవడు, మనవాళ్లతో సంతోషంగా కాసేపు గడిపారు. హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పుట్టినరోజు వేడుక ఈ ఆనంద గడియలకు వేదికైంది. బుధవారం (అక్టోబర్ 7న) ప్రియదర్శిని తన పుట్టినరోజును జరుపుకున్నారు. సుధీర్ బాబు ఇంట్లో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలో కృష్ణ, ఇందిరా దేవి, , నమ్రత, గల్లా జయదేవ్, గల్లా పద్మావతి, సంజయ్ స్వరూప్, మంజుల, ఆదిశేషగిరి రావు, సుధీర్ బాబు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తన ఫ్యామిలీతో గడిపిన ఆనంద క్షణాలను సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కొన్ని ఫొటోలను షేర్ చేశారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రియదర్శిని కేక్ కట్ చేయడం.. కృష్ణతో కలిసి మహేష్ బాబు, నమ్రత, జయదేవ్, సంజయ్ స్వరూప్ భోజనం చేయడం ఫొటోల్లో చూడొచ్చు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఈ ఫొటోల్లో మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మహేష్ బాబు లుక్ చూసి అభిమానులు దిల్‌ఖుష్ అయిపోతున్నారు. ‘‘కళ్లున్నోడు పిక్చర్ అంతా చూస్తాడు.. దిమాక్ ఉన్నోడు మహేష్ బాబు అన్నని చూస్తాడు. వింటేజ్ స్టైల్’’ అంటూ అభిమానులు మహేష్ బాబు లుక్‌ను కట్‌చేసి వైరల్ చేస్తున్నారు. మహేష్ బాబు అందం రోజురోజుకి పెరిగిపోతోంది అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఘట్టమనేని ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి చూసి కృష్ణ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదని పొంగిపోతున్నారు. ఇదిలా ఉంటే, సుధీర్ బాబు అసలు పేరు పోసాని నాగ సుధీర్ బాబు. సొంతూరు విజయవాడ. 1999 టైమ్‌లో సుధీర్ బాబు కుటుంబం హైదరాబాద్ వచ్చి సెటిలైంది. ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ బాబుకు చిన్ననాటి నుంచీ సినిమాలంటే పిచ్చి. మహేష్ బాబు అమ్మమ్మ, సుధీర్ బాబు తల్లి మంచి స్నేహితులట. వాళ్లిద్దరి ద్వారా సుధీర్ బాబు, ప్రియదర్శిని పెళ్లి ప్రస్తావన వచ్చింది. అయితే, మొదట వీళ్లిద్దరూ పెళ్లికి అంగీకరించలేదట. అయినప్పటికీ సుధీర్ బాబు, ప్రియదర్శిని ఫోన్ నంబర్లు ఎక్స్‌చేంజ్ చేసుకున్నారట. ఏడాది తర్వాత న్యూ ఇయర్‌కి సుధీర్ బాబు శుభాకాంక్షలు తెలుపుతూ ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్ అన్నింటికీ మెసేజ్ పంపారట. అలా, అనుకోకుండా ప్రియదర్శినికి మెసేజ్ వెళ్లడం.. మళ్లీ ఇద్దరూ టచ్‌లోకి వచ్చి పెళ్లిచేసుకోవాలి అనుకోవడం జరిగిపోయిందని సుధీర్ బాబు ఓ కార్యక్రమంలో చెప్పారు. 2006లో ప్రియదర్శినిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/33FBRHf
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...