Monday, 5 October 2020

ఇక ఎగతాళి చేయడం ఆపండి.. రేపు అదిరిపోయే అప్‌డేట్: RRR టీం

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR సినిమా కోసం , అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. ఈ ఎదురుచూపుతో ఫ్రస్ట్రేషన్‌కు గురై చిత్ర యూనిట్‌పై తిట్ట పురాణం అందుకున్నారు. RRR మూవీ అఫిషియల్ ట్విట్టర్ పేజీలో పండుగలకు పబ్బాలకు శుభాకాంక్షలు చెబుతుంటే అభిమానులు మాత్రం చిత్ర యూనిట్‌ను తిట్టిపోశారు. ఈ తిట్టడం కూడా రేంజ్‌లో ఉండేది. కానీ, చిత్ర యూనిట్‌కు వాటిని భరించక తప్పలేదు. మొత్తానికి వారికి కూడా సమయం వచ్చింది. RRR షూటింగ్ హైదరాబాద్‌లో తిరిగి ప్రారంభమైనట్టు సోమవారం వార్తలు వచ్చాయి. 7 నెలల తరవాత మళ్లీ షూటింగ్ ప్రారంభమైందని.. ఇది రెండు నెలలపాటు నిర్విరామంగా కొనసాగుతుందని తెలిసింది. దీనికి ఊతమిస్తూ RRR యూనిట్ ఒక ప్రకటన చేసింది. రేపు (అక్టోబర్ 6న) సినిమాకు సంబంధించి ఒక ప్రకటన చేయనున్నట్టు ట్వీట్ చేసింది. అది కూడా చాలా చమత్కారంగా చేసింది. Also Read: ‘‘మా పండుగ పోస్టులు ఇక చాలు. అప్‌డేట్స్ కోసం అసాధారణమైన సృజనాత్మకతతో మీరు చేసే ఎగతాళి ఇక చాలు. మీ ప్రేమతో మమ్మల్ని చంపుతున్నందుకు ధన్యవాదాలు. కాలం వేగంగా గడిచిపోయింది. మొత్తానికి ఆ క్షణం వచ్చేసింది! ఇక మీకు వినోదం పంచడం మా వంతు. రేపటి వరకు వేచి ఉండండి’’ అని RRR టీం ట్వీట్‌లో పేర్కొంది. RRR మూవీ నుంచి ఇప్పటికే టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్, రామ్ చరణ్ టీజర్ విడుదల చేశారు. RRRకు కొనసాగింపుగా ‘రౌద్రం రణం రుధిరం’ టైటిల్‌ను ఖరారు చేశారు. లాక్‌డౌన్ సమయంలో విడుదల చేసిన అల్లూరి సీతారామరాజు పరిచయ టీజర్ సినిమాపై అంచనాలను రెండింతలు చేసింది. ఆ టీజర్‌లో ఎన్టీఆర్ వాయిస్, రామ్ చరణ్ ప్రెజన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఇక కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ లుక్ కోసం నందమూరి అభిమానులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. మరి రేపు ఎలాంటి అప్‌డేట్ వస్తుందో చూడాలి. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, ఆలియా భట్, ఒలీవియా మోరిస్, శ్రియ, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/30Cp6LD
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...